National News - Bangladesh | ఈ నెల 7 లోగా బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సప్లయ్ నిలిపేస్తాం
National News - Bangladesh | ఈ నెల 7 లోగా బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సప్లయ్ నిలిపేస్తాం
- బంగ్లాదేశ్‌కు అల్టిమేటం జారీ చేసిన అదానీ పవర్
Hyderabad : భారత దేశానికి పక్క దేశం బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ సంస్థ గట్టి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. విద్యుత్ కు సంబంధించి బకాయిలు చెల్లించక పోతే బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆదాని పవర్ అల్టిమేటం జారీ చేసింది. అయితే గతంలో బంగాదేశ్‌కు ఇచ్చిన విద్యుత్‌కు బకాయిలే చెల్లించక పోవడం వల్ల విద్యుత్ సరఫరాను తగ్గించింది. కాని ఇప్పుడు విద్యుత్ బకాయిల చెల్లింపుల కోసం గడువు విధించింది. అయితే ఆ గడువు కూడా కూడా ముగిసింది. దీంతో ఈ నెల ఏడో తేదీ లోగా బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా కూడా నిలిపేస్తామని ఆదాని పవర్ ఆల్టిమేటం జారీ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో పరిస్థతులు ఒక్క సారిగా వేడిక్కినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అదానీ పవర్ సంస్థకు బంగ్లాదేశ్ ప్రభుత్వం రూ.7,200 కోట్లు (850 మిలియన్ డాలర్లు) బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లింపు విషయమై బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆధీనంలోని బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డుకు, అదానీ పవర్‌కు మధ్య ఏమైనా లావాదేవీలు జరిగాయా ? లేదా అన్న విషయమై స్పష్టత రావడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం విద్యుత్ బకాయిలు చెల్లించడంతోపాటు సెక్యూరిటీ ఆఫ్ పేమెంట్ కోసం సుమారు రూ.1500 కోట్ల అంటే.. 170 మిలియన్ డాలర్లు కు అక్టోబర్ 31 లోగా లెటర్ ఆఫ్ క్రెడిట్ అందజేయాలని బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డుకు అదానీ పవర్ డెడ్ లైన్ విధించింది. ఈ మేరకు కృషి బ్యాంకు ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఇది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విధానంలో భాగం కాదని బీపీడీబీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే డాలర్ల కొరత వల్ల విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడానికి మరో కారణం అయి ఉండొచ్చని ఆయా వర్గాల భావిస్తున్నాయి. ఫలితంగా గత అక్టోబర్ 31 నుంచి జార్ఖండ్ లోని గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి 1496 మెగావాట్ల విద్యుత్‌కు బదులు 724 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసిందని చెప్పుతున్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశం రాజకీయ సంక్షభం ఎదుర్కొంటుంది. దీంతో బంగ్లాదేశ్ లో ఆర్థికపరమైన సమస్యలు కూడా పట్టి పీడిస్తున్నాయి. మరోపక్క గత నెలలో సుమారు 90 మిలియన్ల డాలర్ల విద్యుత్ బిల్లుల బకాయిలను అదానీ పవర్ కు బీపీడీబీ చెల్లించినట్లు తెలుస్తుంది. నెలవారీ 90-100 మిలియన్ డాలర్ల విద్యుత్ బిల్లులకు బదులుగా కేవలం 20-50 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తూ వచ్చింది. బహుశా దీని వల్లే చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు పెరిగిపోయాయి అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బంగ్లాదేశ్ పవర్ సంస్థలు పవర్ పర్చేజింగ్ తగ్గించుకుంటున్నాయి. ఎన్టీపీసీతో కూడిన జాయింట్ వెంచర్ బంగ్లాదేశ్- ఇండియా స్నేహ బంధం పవర్ కంపెనీ సైతం బొగ్గు కొరత వల్ల సగానికంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. అదానీ పవర్ సంస్థ ఉత్పత్తి చేసే విద్యుత్ మీద యూనిట్ కు రూ.10-12 వరకు ధర పలుకుతుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియాల నుంచి దిగుమతి చేసుకుంటున్న (బొగ్గుతో తయారు చేస్తున్న) విద్యుత్ చార్జీలు కొంత వరకు ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
* * *
Leave A Comment